అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్,చెన్నై సూపర్ కింగ్స్ × గుజరాత్ టైటాన్స్,సాయంత్రం నుంచి అహ్మదాబాద్ లో వర్షం,ఇంకా టాస్ కూడా వేయని వైనం,మైదానాన్ని కవర్లతో కప్పేసిన సిబ్బంది.
నిన్న వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఫైనల్ రిజర్వ్ డే అయిన నేడు జరగనుంది. రాత్రి 7.30 గంటలకు గుజరాత్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, CSK ఐదోసారి కప్పును ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా… గుజరాత్ వరుసగా రెండోసారి గెలవాలని భావిస్తోంది. నిన్న టికెట్ తీసుకున్న ప్రేక్షకులకు నేడు మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వర్షం కారణంగా సీఎస్కే, జీటీల మధ్య నిన్న జరగాల్సిన IPL ఫైనల్ మ్యాచ్ ఇవాల్టికి వాయిదా పడింది. అయితే ఇవాళ కూడా వర్షం అంతరాయం కల్గిస్తే… ముందుగా 5 ఓవర్ల మ్యాచు నిర్వహిస్తారు. అదికూడా సాధ్యం కాకపోతే.. సూపర్ ఓవర్ను ఎంచుకుంటారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే మొత్తంగా మ్యాచ్ను రద్దు చేస్తారు. అనంతరం లీగ్ స్టేజీలో గ్రూప్ టాపర్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్న విజేతగా ప్రకటిస్తారు.
ఇక తుదిజట్లను పరిశీలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్& వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్.