తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా, నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా ఇలా ఎన్నో చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక వివాదంతో ఆయన తెరపైకి వస్తుంటారు. అయితే తాజాగా ఆయనపై ప్రముఖ వెబ్సైట్లో వచ్చిన కథనం మేరకు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ గ్రేట్ ఆంధ్ర వెంకీ గాడికి, వాడికి సంబంధించిన దానికి దయచేసి ఎవరు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు. కళామ్మతల్లి ముద్దుబిడ్డలు మన తెలివితో, మన కష్టంతో మన రక్తాన్ని చమటగా మార్చి పని చేసుకుని కళ్ళమ్మ తల్లి సేవలో ఉన్న మనందరం గ్రేట్ ఆంధ్రను బహిష్కరిద్దాం. వాడికి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు.
మన రివ్యూలు రాస్తే,మన మీద తప్పుగా రాస్తే, మన గురించి చౌకగా చీపుగా రాస్తే వాడి అంతు నేను చూస్తా. వాడు రాజకీయాల్లో ఎన్ని అయినా చేసుకోమను మనకు సంబంధం లేదు. సినిమా పరిశ్రమపై, కళామ్మ తల్లి ముద్దు బిడ్డలపై, సినిమాని నమ్ముకుని బతుకుతున్న వాళ్లపై ఏమాత్రం రాసినా సహించేది లేదు. దయచేసి గ్రేట్ ఆంధ్రను బహిష్కరించండి. ఈ పచ్చని మల్లె తోటలో ఈ గంజాయి మొక్కను పీకేద్దాం. కళామతల్లిని స్మరించుకుందాం. కళామతల్లి నీడలో బ్రతుకుతూ, సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మన న్యూస్ ని గ్రేట్ ఆంధ్రకిస్తే మన తల్లిదండ్రులను, ఆత్మను మోసం చేసుకున్నట్టు. ఇలాంటి గ్రేట్ ఆంద్రాన్ని మనం బహిష్కరించకపోతే మనకు మనం మోసం చేసుకున్నట్టే. నువ్వు రాజకీయంలో ఎవరినైనా తిట్టుకో ఎవరినైనా కొట్టుకొ మాకు సంబంధం లేదు. కానీ సినిమా వాళ్ళ జోలికి వచ్చావా..?
వెంకీ నీ పెంకి పగులుద్ది.. అంటూ స్విచ్ ఆఫ్ దండకం అందుకున్నారు. అరే వెంకట్ రెడ్డి, నువ్వు పెద్ద బ్రోకర్, ఇక్కడ మీ మూర్తి గాడు చిన్న బ్రోకర్. నీలి వార్తలు రాసుకొని, నీలి బతుకులు బతుకుతూ.. దొంగచాటుగా తిరిగే నీకు మా గురించి ఎందుకురా లఫుట్. మేము ప్రేమిస్తాం, పూజిస్తాం, ప్రాణం ఇస్తాం, కోపం వస్తే అలుగుతాం. ప్రేమించినప్పుడు, పూజించినప్పుడు అలిగే హక్కు కూడా ఉంటుందిరా లఫుట్. సినిమా వాళ్ళ వార్తలు, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు లేకపోతే నీకు పబ్బం గడవదురా వెంకీగా. నువ్వు మనిషివైతే నీకు సిగ్గు, శరం ఉంటే నువ్వు తినేది అన్నమే అయితే ఒక్కసారి ప్రత్యక్షంగా నాకు కనపడు.. నీలీ వార్తలు రాసుకునే నీ బతుకు.. నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు జరుగుతున్న నీలి చిత్రాలు గురించి చూసుకోరా బఫున్ కొడకా,నిజాయితీ గలడితో దూరంగా ఉండటానికి ప్రయత్నించు. నీతిగా బతికేవాడి జోలికి రాకు మాడి మసై పోతావ్ అంటూ ట్విట్టర్ వేదికగా తన ప్రస్టేషన్ వెల్లడించారు.