స్థానిక శ్రీ వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న బి.నాగ సుబ్బారెడ్డి, వి. సాయి భావన, డి. మాలిక్ భాష, సిహెచ్. కావ్య సుధా, ఎం. నాగదేవి మరియు వి. సుమంత్ నాయుడు అనే ఈ ఆరుగురు విద్యార్థులకు ప్రముఖ మల్టీ నేషనల్ సొనాటా సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు పొందినారు అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రంగా నాగేంద్రబాబు తెలిపారు.
తమ కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైన విద్యార్థులకు కళాశాల చైర్మన్ శ్రీ పసుమర్తి వెంకటేశ్వర రావు, సెక్రటరీ శ్రీ ఊటుకూరు సుబ్రహ్మణ్యం, కరస్పాండెంట్ శ్రీ పోట్రు నాగేశ్వరరావు, ట్రెజరర్ ముత్యాల కిషోర్ బాబు మరియు టిపిఓ అభినందనలు తెలియజేసినారు.