Movies

పవన్ కళ్యాణ్ మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం ….

పవన్ కళ్యాణ్ మూవీ సెట్ లో  అగ్ని ప్రమాదం ….

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఊహించని షాప్ తగిలింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సెట్ లో తాజాగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా సెట్ లో నిన్న అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం అందుతోంది. దీంతో… చిత్ర బృందం సభ్యులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ తరుణంలో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది… సినిమా సెట్ లో మంటలను ఆర్పేశారు. గతంలో వర్షానికి సెట్ కూలగా తాజాగా దానికి మరమత్తులు చేసే క్రమంలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది. ఇక ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందుతుంది. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.