దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఈరోజు లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపుపై పురోగతి నేపథ్యంలో ఇన్వెస్టర్ సెంటిమెంటు బలపడింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 345 పాయింట్లు లాభపడి 62,846కి పెరిగింది. నిఫ్టీ 99 పాయింట్లు పుంజుకుని 18,599 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.71%), టైటాన్ (2.48%), టాటా స్టీల్ (1.88%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.55%), హెచ్డీఎఫ్సీ (1.53%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.09%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.95%), మారుతి (-0.77%), విప్రో (-0.47%), టీసీఎస్ (-0.29%).