అగ్రరాజ్యం అమెరికాకు దివాలా ముప్పు తప్పినట్లే ఉంది. ఈనెల 31వ తేదీలోగా అప్పుల పరిమితిని పెంచే బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందకపోతే చేయాల్సిన అన్నీ బిల్లులన్నీ ఆగిపోతాయి. ఆదాయాలు తగ్గిపోయి చెల్లిపులు విపరీతంగా పెరిగిపోతే ఏ ప్రభుత్వం అయినా ఏమిచేస్తుంది ? అప్పుల పరిమితిని పెంచుకుంటు పోతుంది. పెరిగిపోతున్న చెల్లింపులు చేయటానికి డబ్బులు లేకపోతే ఏమవుతుంది ? ఎక్కడ బిల్లులు ఎక్కడ చెల్లింపులు అక్కడ ఆగిపోతాయి. దాన్నే దివాలా అంటారు.
ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా దివాలా అంచున నిలబడుంది. బిల్లుల చెల్లింపులన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే బిల్లులు చెల్లించటానికి ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు. అప్పిచ్చే వాళ్ళున్నా తీర్చే మార్గాలు లేవు. అందుకనే రుణపరిమితిని పెంచుకోవటం ఒకటే మార్గం. అందుకనే అప్పు పరిమితిని పెంచుకునేందుకు అనుమతి కోరుతు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే పార్లమెంటులోని ప్రధాన ప్రతిపక్షం రిపబ్లికన్లు ఆ బిల్లును అడ్డుకున్నారు.
బిల్లు గనుక మే 31వ తేదీలోగా పార్లమెంటు ఆమోదంపొందకపోతే చెల్లింపులపై ప్రభుత్వం చేతులెత్తేయటమే మిగిలింది. దీన్నే దివాలా ప్రాసెస్ అనంటారు. ఇలాంటి పరిస్ధితుల్లో అధికార డెమక్రాట్లకు ప్రతిపక్ష రిపబ్లికన్లకు మధ్య చర్చలు జరిగి ఒప్పందం కుదిరింది.దీని ప్రకారం ప్రభుత్వ అప్పుల పరిమితిని 31.4 ట్రిలియన్ డాలర్లకు పెంచుకునేందుకు రెండు పక్షాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది. బహుశా సోమ మంగళవారాల్లో పార్లమెంటులో బిల్లు పాస్ అయిపోతుందనే అనుకుంటున్నారు.
బయట ఒప్పందం కుదిరింది కాబట్టి పార్లమెంటులో బిల్లు పాసవ్వటం లాంఛనమే అని అనుకుంటున్నారు. పార్లమెంటులో బిల్లు పాసవ్వగానే వేలాది బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను ప్రభుత్వం జారీచేస్తుంది. ఆర్ధిక సంస్ధలు వ్యక్తుల తరపున బాండ్ల కొనుగోలుకు మార్గం సుగమమవుతుంది. అప్పుడు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు వచ్చి చేరుతాయి.దాంతో చెల్లింపులు చేయటానికి చేతిలో డబ్బుంటుంది. చెల్లింపులు చేయటం మొదలైతే దివాలా ప్రమాదం నుండి అమెరికా బయటపడిపోయినట్లే అనుకోవాలి. మరిలా అప్పులతో అమెరికా ఎంతకాలం నెట్టుకొస్తుందో చూడాలి.