జీవితంలో డబ్బు ప్రధానమే.. అయితే డబ్బుకు ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఉన్న అంతకంటేనే జీవితంలో ఎక్కువ విషయాలు కొన్ని ఉన్నాయని ఆచార్య చాణక్యుడు చెప్పారు. చాణక్యుడి చెప్పిన మాటలను జీవితంలో స్వీకరించిన వ్యక్తి సమస్యలకు భయపడడు.
జ్ఞానం: తెలివైన వ్యక్తి తన జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని పరిష్కరించుకుంటాడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఈ గుణం కారణంగానే తాను చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తాడని విశ్వాసం. అలాంటి వ్యక్తికీ డబ్బు లేకపోయినా అతనికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది.జ్ఞానం ఉన్న వ్యక్తి తెలివితేటల ఆధారంగా సొంతంగా డబ్బు సంపాదించుకుంటాడని చాణక్యుడు చెప్పాడు. సమాజంలో తెలివి తేటలు, అన్ని విషయాలపై జ్ఞానం ఉన్న వ్యక్తులకు అగ్రస్థానం దక్కుతుందని తెలిపాడు. అంతేకాదు మనిషికి ఎక్కడ జ్ఞానం దొరికినా దానిని తప్పకుండ స్వీకరించాలని తెలిపారు.
అనుభవం: మనిషి నిరంతర జ్ఞాని. తన జ్ఞానాన్ని మెరుగుపరచుకుంటూనే ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అనుభవం సాధన ద్వారానే వస్తుందని, అప్పుడే మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోగలడు. ఈ గుణం ఉన్న వ్యక్తి ఎటువంటి లక్ష్యాన్నిఅయినా చేరుకుంటాడని పేర్కొన్నాడు. సానుకూలత, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సానుకూలంగా ఆలోచిస్తూ ఆ కష్టాన్ని ఎదుర్కొని.. పనిచేసే వారు తన ప్రతి కష్టం నుండి బయటపడతారని చాణక్య నీతి చెబుతుంది. అలాంటి కష్టం నుంచి బయటపడటానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకే ప్రతి వ్యక్తి.. ఎల్లప్పుడూ సానుకూల దృష్టితో ఉండాలి. నిజాయితీ గొప్ప ధర్మం అని చాణక్యుడు చెప్పాడు. నిజాయితీగా పని చేసే వారికి కష్టానికి తగిన ఫలితం దక్కడంతో పాటు సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. అందుకే నిజాయతీ ఉన్నవారు ఎప్పుడూ సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంటారు.