Politics

కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత…

కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత…

మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక లోక్‌సభ సభ్యుడు బాలు ధనోర్కర్ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. ధనోర్కర్ కు 47ఏళ్ల వయస్సు. అతని భార్య ప్రతిభా ధనోర్కర్ వరోరా-భద్రావతి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉన్నాయి.చంద్రపూర్ లోక్సభ స్థానం నుంచి ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. గతంలో శివసేన పార్టీలో ఉండగా.. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలా ఉంటే బాలు ధనోర్కర్ తండ్రి నారాయణ్ సుదీర్ఘ అనారోగ్యంతో శనివారం నాగ్‌పూర్‌లో కన్నుమూశాడు. ఆదివారం అతని అంత్యక్రియలు జరిగాయి. అయితే ఆ సమయంలో బాలు ధనోర్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో అంత్యక్రియలకు హాజరుకాలేక పోయారు.