మహిళల రక్షణ కోసం ఎలక్ట్రిక్ చెప్పులను రూపొందించాడు ఝార్ఖండ్‌లోని ఛత్రాకు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి. విమెన్ సేఫ్టీ డివైజ్ పేరుతో మంజీత్ కుమార్ వీటిని తయారు చేశాడు. మహిళలు, బాలికలకు వేధింపులు ఎదురైన సమయంలో ఎలక్ట్రిక్ చెప్పులతో పోకిరీలను తంతే కరెంట్ షాక్ తగిలి అక్కడే కిందపడిపోతాకేవలం రూ.500లకే ఈ డివైజ్‌ను తయారు చేయడం విశేషం. ఇందుకోసం మంజీత్ వారం సమయం తీసుకున్నాడు. నిర్భయ వంటి ఘటన మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండేందుకు మహిళల రక్షణ కోసం దీనిని రూపొందించానని చెప్పారు