DailyDose

జమ్ముకశ్మీర్ లో ఘోర ప్రమాదం..

జమ్ముకశ్మీర్ లో ఘోర ప్రమాదం..

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

మంగళవారం ఉదంయ జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై యాత్రికులతో వెళ్తున్న బస్తు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అమృత్ సర్ నుంచి కట్రాకు వెళ్తుండగా జమ్ము కశ్మీర్‌లోని ఝోజ్జర్ కోట్లి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయాపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

ప్రమాదం జరిగిన సమయంలో 75 మంది ప్రయాణికులతో బస్సు అమృతసర్ నుంచి కత్రాకు వెళ్తోంది. సోమవారం రాజస్థాన్ లోని జుంజు జిల్లాలో ట్రాక్టర్ ట్రాలీ లోయలో పడి ఆరుగురు మహిళలు, ఇద్దరు మైనర్లతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు. సాయంత్రం మానస మాతా ఆలయంలో జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొన్ని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.