మూడు రోజుల పర్యటన నిమిత్తం కంబోడియా రాజు నోరోడోమ్ సిహమోని తొలిసారిగా భారత్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కంబోడియా రాజుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిచయం చేశారు. ఆయన మే 29 నుంచి 31 వరకు భారత్ లో పర్యటించనున్నారు. మొత్తం 27 మంది ప్రతినిధులతో కూడిన అత్యున్నత బృందంతో కలిసి కాంబోడియా రాజు భారత్ పర్యటనకు విచ్చేశారు. ఈ బృందంలో రాయల్ ప్యాలెస్ మంత్రి, విదేశాంగ మంత్రి, ఇతర సీనియర్ అధికారులున్నారు. భారత్ కాంబోడియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంబోడియా రాజు భారత్ పర్యటనకు విచ్చేశారు. 1952లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమయ్యాయి. అలాగే 60 ఏళ్ల విరామం తరువాత కాంబోడియా రాజు భారత్‌లో పర్యటిస్తున్నారు. 1963లో ప్రస్తుత రాజు నరోడోమ్ షిమామోని తండ్రి గతంలో భారత్‌లో పర్యటించారు.