కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీని వైసీపీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన డిమాండ్ చేశాయి. కాపులను కులం పేరుతో దూషించడాన్ని ఐక్య కాపునాడు, కాపు వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి కులం పేరుతో బూతులు తిట్ట డాన్ని అన్ని వర్గాలు గమనిస్తున్నాయన్నారు. రంగా విగ్రహాలకు దండలు వేసి, రంగా కుమారుడితో మాట్లాడితే సరిపోదని, సాటివారిని గౌరవించడం తెలుకో వాలని హితవు పలికారు. కొడాలి నానీని వైసీపీ కాపు నాయకులు ప్రశ్నించ డంతోపాటు కాపు సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొడాలిపై పోలీసులు సుమోటోగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. కాపు సంక్షేమ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కాపు జాతిని అవహేళన చేయడం ఆంధ్ర రాష్ర్టానికే అవమానమన్నారు. కాపులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు