ఈమేరకు దేశంలోనే అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రసవాలకు సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 47.13%, ప్రైవేటు ఆసుపత్రుల్లో 61.08% సిజేరియన్లుగా ఉన్నాయి. అబార్షన్లు అతి తక్కువగా జరుగుతున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అలాగే మాతాశిశు మరణాల రేటును క్రమంగా తగ్గించుకుంటూ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. ఆసుపత్రిలో ప్రసవాలకు సంబంధించి కూడా తెలంగాణ వంద శాతం లక్ష్యాన్ని చేరింది. గత మూడేళ్లలో సిజేరియన్ల రేటు పెరిగినట్లు నివేదికలో పేర్కొంది.