Fashion

పద్మ అవార్డులు-2024 నామినేషన్లకు ఆహ్వానం సెప్టెంబర్ 15 వరకు గడువు….

పద్మ అవార్డులు-2024 నామినేషన్లకు  ఆహ్వానం సెప్టెంబర్ 15 వరకు గడువు….

పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పద్మ పురస్కారాలు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటిగా ఉన్నాయి. 1954లో నెలకొల్పిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు.

కళలు, సాహిత్యం , విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ , ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, ట్రేడ్ , ఇండస్ట్రీ మొదలైన అన్ని రంగాలు/ విభాగాల్లో విశిష్టమైన ,అసాధారణమైన విజయాలు/సేవలకు గాను ఈ అవార్డు ఇస్తారు. జాతి, వృత్తి, హోదా లేదా లింగ భేదం లేకుండా వ్యక్తులు అందరూ కూడా ఈ అవార్డులకు అర్హులు. డాక్టర్లు, సైంటిస్టులు మినహా పి ఎస్ యు లలో పని చేసే ప్రభుత్వోద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కారు.

సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న స్ఫూర్తితో పని చేసే సామాజిక సేవా కార్యకర్తల పేర్లను పీపుల్స్‌ పద్మ 2024కి నామినేట్‌ చేయాలని తెలిపింది. సెప్టెంబరు 15లోపు నామినేషన్లను https://awards.gov.in పోర్టల్‌కు ఆన్‌లైన్‌ ద్వారా పంపాలని సూచించింది.