Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 31.05.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓

🐐 మేషం
ఈరోజు (31-05-2023)

శుభ ఫలితాలు ఉంటాయి. ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొంటారు. ఆదిత్య హృదయం చదవాలి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (31-05-2023)

అవసరానికి తగిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకండి. అందరినీ కలుపుకొనిపోతే తొందరగా విజయాన్ని అందుకుంటారు. మంచి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదైవ నామస్మరణ శక్తిని ఇస్తుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (31-05-2023)

ప్రారంభించి పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో
వ్యవహరించారు. ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే బాగుంటుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (31-05-2023)

అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన ప్రారంభం ఉంటుంది. శని శ్లోకం చదివితే బాగుంటుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (31-05-2023)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త

వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (31-05-2023)

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక కీలక విషయంలో మీ ఆలోచనాధోరణికి ప్రశంసలు లభిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు శుభ కాలం. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (31-05-2023)

మిశ్రమకాలం. అప్పగించిన పనుల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. వృథా ప్రసంగాలతో లేనిపోని తలనొప్పులు వస్తాయి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. దుర్గారాధన శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (31-05-2023)

మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. ఉమామహేశ్వరస్తోత్రం చదివితే మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (31-05-2023)

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (31-05-2023)

బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. కొందరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వృథా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దుర్గా సందర్శనం శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (31-05-2023)

ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (31-05-2023)

శుభ ఫలితాలు వచ్చాయి. కాలం సహకరిస్తుంది. మీ రంగాలలో విజయం సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవ ప్రార్ధన చేస్తే మంచిది.
🦈🦈🦈🦈🦈🦈🦈