దేశ రాజధానిలో నియంత్రణకు AI ఆధారిత వ్యవస్థను ఢిల్లీ ప్రభుత్వం తీసుకురానుంది. ఇందులో భాగంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థను తీసుకురానుంది. వచ్చే ఏడాది చివరినాటికి దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రూ.1400 కోట్ల ఖర్చుతో చేపడుతోన్న ఈ ప్రాజెక్టు.. వాహన రద్దీని తగ్గించడంతోపాటు వాహనాలు వేగంగా, సులువుగా కదిలేందుకు దోహదపడుతుందని దిల్లీకి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.ముఖ్యంగా వాహనాల రద్దీ, వాటి వేగం అంశాల ఆధారంగా ట్రాఫిక్ సిగ్నల్స్ స్వయంగా నియంత్రించుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ను 2024 చివరికల్లా అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.