Politics

ఎంపీ కేశినేని నాని వైకాపాలో చేరికకు ముహూర్తం ఖరారు?

ఎంపీ కేశినేని నాని వైకాపాలో   చేరికకు ముహూర్తం ఖరారు?

గత కొంతకాలంగా అధిష్టానం పై గుర్రు గా ఉన్న కేశినేని నాని వైకాపా అధిష్టానానికి టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం,,

కొద్దిరోజుల క్రితం హైదరాబాదులో సజ్జల రామకృష్ణారెడ్డిని
కలిసిన నాని, జగన్ ఢిల్లీ పర్యటనలో కొంతసేపు సమావేశం అయినట్లు సమాచారం.

వైకాపా కేంద్ర అధిష్టానంతో వచ్చిన నిర్దిష్ట రూట్ మ్యాప్ ప్రకారం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిలతో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్
ద్వారా పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు..

ఆదివారం జూన్ నెల 4వ తారీఖు
ఏడు నియోజకవర్గాల అనుచరులతో సమావేశం అయిన పిదప కేశినేని నాని వైకాపాలో చేరేందుకు
ముహూర్తం ఖరారు చేసుకునే అవకాశం ఉన్నది..

ఆ క్రమంలోనే జగ్గయ్యపేట నందిగామ మైలవరం నియోజకవర్గం లో వైకాపా ఎమ్మెల్యేలతో నాని పర్యటనలు చేయడం జరుగుతుంది..

తన పార్లమెంటు నిధులను కూడా 264 గ్రామాలలో తెలుగుదేశం గెలిచినటువంటి 53 పంచాయతీలను వదిలి వైకాపా పంచాయతీలకు
ఇవ్వడం జరుగుతుంది..

వైకాపా అధిష్టానం ఆదేశాల మేరకు రెండు నెలలు
తెలుగుదేశం పార్టీని బురద జల్లి
కొడాలి నాని వల్లభనేని వంశీల సరసన
నిలబెట్టాలని వైకాపా అధిష్టానం ప్లాన్ చేయడం జరిగింది..

రెండోసారి గెలిచిన దగ్గర నుండి పార్టీ అధిష్టానానికి దూరంగా ఉంటున్నటువంటి కేేశినేని నాని..

ఏడు నియోజకవర్గాల ఇన్చార్జులు
గత సంవత్సర కాలంగా కేశినేని చిన్నితో ప్రయాణం చేస్తున్నారు..

2024 పార్లమెంటు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నుంచి అన్నదమ్ములు ఇద్దరు నాని వైకాపా నుండి చిన్ని తెలుగుదేశం నుండి పోటీ చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి..