Health

పరగడుపున ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…

పరగడుపున ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…

🎋 చెరుకు రసం తాగే వారి సంఖ్య అధికంగానే ఉంది.

🎋 ఇది శరీరానికి చలువ చేస్తుంది, కాబట్టి ఈ చెరుకు రసాన్ని ఎక్కువమంది తాగేందుకు ఇష్టపడుతున్నారు.

🎋 దీన్ని హిందీలో ‘గన్నే క రస్ ( Sugarcane Juice’ అని పిలుస్తారు. 🎋

🎋 ఒక గ్లాసు చెరుకు రసంతో రోజును ప్రారంభిస్తే ఎన్నో రకాల ఆరోగ్యాన్ని ప్రయోజనాలు కలుగుతాయని..
శ్రీ జీవన ఆయుర్వేద వైద్యశాల విజయవాడ ,డాక్టర్.శివకృష్ణ MD (Ayurveda) చెబుతున్నారు.

🫖 ఎక్కువ మంది టీ తోనే తమ రోజును ప్రారంభిస్తారు. బదులుగా రోజూ చెరుకు రసాన్ని తాగి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది.

🎋 ఈ తీపి పానకం అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది.

ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది.

🎋 శతాబ్దాలుగా ఆయుర్వేద సంప్రదాయ మందుల్లో చెరుకు రసాన్ని వాడుతున్నారు.

దీన్ని తాగడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

🎋తక్షణమే శక్తి… 🎋

🎋 చెరుకు రసం ఒక ఎనర్జీ డ్రింక్.

🎋 దీనిలో గ్లూకోజ్ అధికంగా ఉంటుంది.

🎋 అధిక చక్కెర కంటెంట్ కారణంగా ఇది తాగిన వెంటనే శక్తిని అందిస్తుంది.

🎋 ఖాళీ పొట్టతో తాగడం వల్ల ఈ శక్తి శరీరం అంతటా పాకుతుంది.

🎋 ఇది మీరు ఆరోగ్యకరంగా రోజును కిక్ స్టార్ట్ చేసేందుకు సహకరిస్తుంది.

🎋 వేసవికాలంలో డిహైడ్రేషన్ సమస్య బారిన పడుతూ ఉంటారు. దీని నుంచి తప్పించుకునేందుకు చెరుకు రసాన్ని తాగితే మంచిది.

ఇది దాహాన్ని తీర్చే అద్భుతమైన పానీయం.

🎋 నీటి శాతం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో నుంచి బయటికి పోయిన ద్రవాలను తిరిగి నింపేందుకు సహకరిస్తుంది.

🎋 శరీరంలోని విష పదార్థాలను, ట్యాక్సీన్లను బయటికి పంపిస్తుంది.

🎋 చెరుకు రసంలో విటమిన్ ఏ, విటమిన్ బి,విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

● ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహకరిస్తాయి.

● ఎముకలు, దంతాలను చేస్తాయి.

● జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి.

● జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా నిర్వహించడంలో సహకరిస్తాయి.

● మలబద్దకాన్ని అడ్డుకుంటాయి.

● పేగు కదలికలను చురుకుగా చేసి జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి.

🎋 కాబట్టి ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే శరీరం అంతా ఆరోగ్యకరంగా ఉంటుంది. 🎋

🎋 చెరుకు రసం చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.

🎋 రోజు తాగితే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి.

◆ మొటిమలు, మచ్చలు వంటివి రాకుండా అడ్డుకుంటాయి.

◆ ఆక్సీకరణ ఒత్తిడిని అకాల వృద్ధాప్యాన్ని రాకుండా నివారిస్తాయి.

◆ బరువు తగ్గాలనుకునే వారికి చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది.

◆ దీనిలో కొవ్వు ఉంటుంది.

◆ కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోదు.

◆ ఖాళీ పొట్టతో దీన్ని తాగినప్పుడు త్వరగా పొట్ట భావనని ఇస్తుంది.

◆ కాబట్టి ఆ రోజు ఎక్కువగా ఆహారం తినాలన్న కోరిక తగ్గుతుంది.