పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ నీటి పారుదల ఇంజీనిర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు. ఏడాది ముందుగానే నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. భేటీ అనంతరం సమీక్ష వివరాలను వెల్లడించారు నారాయణ రెడ్డి. అడహక్ నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.17,414 కోట్లు కేంద్రాన్ని అడిగిందని తెలిపారు. దీనిపై కేంద్రం పరిశీలిస్తామని చెప్పిందన్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకు అర్ అండ్ అర్ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా, సానుకూలంగా స్పందించిందని చెప్పారు.ఈ భేటీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.