చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గురువారం మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ఐపీఎల్‌లో మహీ మోకాలి సమస్యతో బాధపడుతూ ఉన్న సంగతి తెలిసిందే. చెన్నై టైటిల్ గెలిచిన వెంటనే ముంబయిలోని ఆసుపత్రికి వెళ్లాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్‌కు పంత్‌కు చికిత్స అందించిన వైద్యుడిని సంప్రదించగా ఆపరేషన్ అవసరమని చెప్పారు. దాంతో ధోని మోకాలికి చికిత్స కోసం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకున్నాడు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆపరేషన్ చేయగా అది విజయవంతమైంది. ధోనికి వైద్యుడు దిన్షా పార్దివాలా చికిత్స ఆపరేషన్ చేశారు.