TSRTC ఉద్యోగులకు సంస్థ శుభవార్త చెప్పింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులకు డీఏ ఇస్తున్నట్లు ప్రకటించింది. జూలై 2022లో ఇవ్వాల్సిన 4.9శాతం డీఏను తాజాగా మంజూరు చేస్తుండగా.. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన మరో డీఏను త్వరలోనే ఇస్తామని TSRTC ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని వారు ప్రకటించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుందని బాజిరెడ్డి గోవర్థన్, సజ్జనార్ లు తెలిపారు.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్….
