అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో కుటుంభం మొత్తం ఆనందంతో మునిగిపోయింది. 2019లో ఆకాష్, శ్లోకల వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఒక బాబు ఉన్నట్లు అందరికి తెలుసు.కాగా ఇప్పుడు మరో పండంటి బిడ్డకు ఆ దంపతులు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అంబానీ కుటుంబానికి సన్నిహితుడైన ‘పరిమల్ నథ్వానీ’ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాజాగా ఆడపిల్ల పుట్టడంతో ఆ ఇంట్లో సంతోషం నెలకొంది.