Politics

బీజేపీ, కాంగ్రెస్‌కు మంత్రి కేటీఆర్ సవాల్..

బీజేపీ, కాంగ్రెస్‌కు మంత్రి కేటీఆర్ సవాల్..

ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తున్న ప్ర‌తిప‌క్షాల‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు. తెలంగాణ క‌న్నా ఉత్త‌మ పాల‌న ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు దమ్ముంటే ఆ పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 స్థానాలు గెలుస్తామన్నారు కేటీఆర్. మరోసారి కేసీఆర్‌ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు