NRI-NRT

భారత్ లో నేపాల్ ప్రధాని పర్యటన….

భారత్ లో నేపాల్ ప్రధాని పర్యటన….

నాలుగు రోజుల పర్యటన కోసం నేపాల్‌ ప్రధానమంత్రి పుష్ప కమల్‌ దహల్‌ ‘ప్రచండ’ బుధవారం భారత్‌కు చేరుకున్నారు. భారత్‌-నేపాల్‌ సంబంధాల మెరుగుదలకు ఈ పర్యటన తోడ్పడుతుందని భావిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ప్రధాని పదవి చేపట్టిన 68 ఏళ్ల ప్రచండకు ఇదే మొదటి విదేశీ పర్యటన కావడం విశేషం. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రచండకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి స్వాగతం పలికారు. నేపాల్‌ ప్రధాని వెంట ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం వచ్చింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రచండ చర్చలు జరపనున్నారు. ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనకర్‌లతో కూడా ప్రపంచ సమావేశాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం ఇండోర్‌కు వెళ్లి, తరువాత రోజున నేపాల్‌కు ప్రచండ బయలుదేరనున్నారు.