Politics

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైంది….

తెలంగాణ  దశాబ్ది  ఉత్సవాలకు  ముస్తాబైంది….

సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వయం పాలనకు 9 ఏళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి వెళ్తున్నామని అన్నారు.2014 జూన్ 2న ఏర్పడిన తెలంగాణ 9 ఏళ్లు పూర్తి చేసుకుని, పదో ఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో రేపట్నుంచి 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా.. తెలంగాణ నూతన సచివాలయం, అసెంబ్లీ, అమరవీరుల జ్యోతి, BRK భవన్, ఛార్మినార్ సహా ఇతర చారిత్రిక కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించగా.. దశాబ్ది ఉత్సవాల శోభతో అవి కళకళలాడుతున్నాయి.నేడు దేశంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రజలు ప్రతి వాడలో ఘనంగా జరుపుకోవాలని కోరారు.