అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22న కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు మిమ్మల్ని ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’’ అని అమెరికా కాంగ్రెస్ అగ్రనేతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా ఈ వేదికపై బ్రిటీష్ మాజీ PM చర్చిల్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా తర్వాత రెండు సందర్భాల్లో US కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించనున్న నేతగా PM ఘనత సాధించనున్నారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి.ఈ సభలో భారత్ – USల మధ్య అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణ, ఉభయ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లపై మోదీ ప్రసంగించనున్నారు.మోదీ గౌరవార్థం అగ్రరాజ్య అధినేత జో బైడెన్ 22వ తేదీన విందు ఇవ్వనున్నారు.