Health

వెన్నునొప్పితో బాధపడుతున్నారా….

వెన్నునొప్పితో  బాధపడుతున్నారా….

వెన్ను నొప్పి లేదా బ్యాక్ పెయిన్‌.చాలా మందిని కామ‌న్‌గా ఈ స‌మ‌స్య వేధిస్తుంటుంది.ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చుని ప‌ని చేసే వారిలో, అధిక బ‌రువులు మోసే వారిలో వెన్ను నొప్పి స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది.మొద‌ట వెన్ను నొప్పి వెన్నుకు మాత్ర‌మే వ‌స్తుంది.

ఈ త‌రుణంలో దానిని నిర్ల‌క్ష్యం చేస్తే క్ర‌మంగా ఆ నొప్పి కాస్త వెన్ను నుంచి కాళ్లకు, చేతుల‌కు కూడా పాకేసి నానా ఇబ్బందులు గురి చేస్తుంది.అందుకే వెన్ను నొప్పి కొద్దిగా ఉన్నప్పుడే పలుచిట్కాలతో దాన్ని నివారించుకోవాలి.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే సులువుగా వెన్ను నొప్పికి చెక్ పెట్ట‌వ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు లేదా ఐదు స్పూన్ల నువ్వుల నూనె మ‌రియు మూడు రెబ్బ‌ల వెల్లుల్లి వేసి బాగా మరిగించాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని గోరు వెచ్చ‌గా అయ్యాక‌.వెన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేసి కాసేపు మ‌సాజ్ చేయించుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల వెన్ను నొప్పి నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొంతుతారు.అలాగే పసుపు కలిపిన పాలు వెన్ను నొప్పికి బెస్ట్ రెమెడీ.ప‌సుపులో నొప్పుల‌ను నివారించే కుర్​క్యుమిన్, పాల‌లో ఎముకుల‌ను బ‌ల‌ప‌రిచే క్యాల్షియం, విటమిన్– డి పుష్క‌లంగా ఉంటాయి.

కాబ‌ట్టి, రెగ్యుల‌ర్‌గా ప‌సుపు క‌లిపి పాలు తీసుకుంటే వెన్ను నొప్పికి దూరంగా ఉండొచ్చు.యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్క‌లంగా ఉండే అల్లం.వెన్ను నొప్పికి చెక్ పెట్ట‌గ‌ల‌దు.అందువ‌ల్ల‌, అల్లాన్ని రెగ్యుల‌ర్ తీసుకుంటే వెన్నునొప్పి ఎప్ప‌టికీ ఉండదు.వెన్ను నొప్పితో బాధ ప‌డే వారు ప్ర‌తి రోజు యోగా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

యోగా శరీరానికి బలాన్ని అందించ‌డంతో పాటు ఎప్పుడూ ఫిట్​గా ఉండేందుకు స‌హాయ‌ప‌డుతుంది.అదే స‌మ‌యంలో వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా యోగా గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.రోజులో క‌నీసం ఇర‌వై నిమిషాలు అయినా యోగా చేయండి.