బ్రిటన్ రాజు ఛార్లెస్ III రెండో తనయుడు ప్రిన్స్ హ్యారీ , ఆయన సతీమణి మెర్కెల్ (Meghan Markle)లు కొంతకాలంగా వరుస వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమపై చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఓ వార్తా సంస్థపై హ్యారీతోపాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణకు రానుంది. ఈ కేసులో కోర్టుకు హాజరై బోనులో నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో 130 ఏళ్లలో కోర్టు రూమ్‌లో సాక్ష్యం చెప్పిన ఓ బ్రిటన్ రాజకుటుంబీకుడిగా ప్రిన్స్ హ్యారీ నిలవనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది.
బ్రిటన్‌కు చెందిన మిర్రర్ గ్రూప్.. అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలకు సంబంధించి ప్రిన్స్ హ్యారీతోపాటు వంద మందికిపైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు. ఈ కేసు విచారణ మేలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా లండన్ హైకోర్టులో హ్యారీ సాక్ష్యం చెప్పనున్నారు.
ఎడ్వర్డ్ VII 1870లో విడాకుల కేసులో సాక్షిగా సాక్ష్యమిచ్చిన తర్వాత మరియు 20 సంవత్సరాల తర్వాత కార్డ్ గేమ్‌పై అపవాదు విచారణలో, అతను రాజు కావడానికి ముందు రెండింటిలోనూ ఒక సీనియర్ రాయల్ సాక్ష్యం ఇవ్వడం ఇదే మొదటిసారి.