NRI-NRT

2023 తానా ఎన్నికలు లేనట్లేనా?-TNI ప్రత్యేకం

2023 తానా ఎన్నికలు లేనట్లేనా?-TNI ప్రత్యేకం

తానా 2023 ఎన్నికలకు బ్రేకులు పడినట్లు సమాచారం. తానా లాయర్ల సూచనల మేరకు ఈ ఎన్నికలు ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు సమాచారం. నూతనంగా జేరిన 15500 కుటుంబాలకు చెందిన ముగ్గురు తానా జీవితకాల సభ్యులు తమ సభ్యత్వ నిర్ధారణకు జరిగిన జాప్యాన్ని సవాల్ చేస్తూ కోర్టులో దావా వేశారు. వీరి సభ్యత్వం మీద తుదితీర్పు వెల్లడించే వరకు తానా ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల చేయవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

తానా రాజ్యాంగం ప్రకారం ఏప్రిల్ 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. గడువు లోపల ఎన్నికలు పూర్తి చేయలేకపోతే ఎన్నికల కమిటీ బోర్డు ఆమోదంతో నూతన తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. నూతన తేదీని ప్రకటించాడానికి బోర్డులో మెజార్టీ అవసరం. 15మంది సభ్యులు కలిగిన ప్రస్తుత బోర్డులో రెండొంతుల మెజార్టీ(10 మంది) ఏ వర్గానికి లభించని కారణంగా నూతన తేదీని ప్రకటించే అవకాశం లేని కారణంగా ప్రస్తుత ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పంపిన చెక్కులు, మనీ ఆర్డర్లు 90రోజుల గడువు దాటి మురిగిపోయాయి. వీటిని ఎన్నికల కమిటీ తిరిగి అభ్యర్థులకే పంపిస్తున్నట్లు సమాచారం.

కోర్టు కేసుల కారణంగా తానా లాయర్లకు అయిన ఖర్చును వసూలు చేసుకోవచ్చునని కోర్టు ఇచ్చిన ఆదేశాలకనుగుణంగా ప్రస్తుతం ఓ వర్గం వారి నుండి ఈ సొమ్ములను రికవరీ చేసే క్రమంలో మరో వర్గం బిజీగా ఉన్నట్లు వినికిడి.

తానా తదుపరి అధ్యక్షుడు(రాలు) ఎన్నికయ్యేది ప్రజాస్వామ్య పద్ధతిలోనా లేక నాలుగు గోడల మధ్య కరచాలనాల సందుల్లోనా అనేది ఇంకా బదులు దొరకని ప్రశ్న.