Politics

అమరవీరుల ఆత్మ ఘోషిస్తోంది కె ఏ పాల్ కీలక వ్యాఖ్యలు …

అమరవీరుల ఆత్మ ఘోషిస్తోంది కె ఏ పాల్  కీలక వ్యాఖ్యలు …

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అమరవీరుల త్యాగం వల్లే తెలంగాణ వచ్చింది. పోరాడింది, ప్రాణాలిచ్చింది వాళ్లే. వారి కన్నీటిని తుడిచేందుకు నేను వచ్చా. తెలంగాణలో అభివృద్ధి లేదు. అప్పుల తెలంగాణ, దరిద్రపు తెలంగాణ అయిపోయింది. అమరవీరుల ఆత్మ ఘోషిస్తోంది. అధికారంలోకి వచ్చాక 1538 అమరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఇస్తాం’ అని తెలిపారు.కానీ నేడు ఈ రాష్ట్రము పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉందన్నారు. ఈ రాష్ట్రము కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ప్రాణాలను అర్పించింది మరియు పోరాడింది అమరవీరులు. కానీ వారి గురించి పట్టించుకునే వారే నేడు కరువయ్యారని బాధపడ్డారు. వారికోసమే నేను ఇక్కడకు వచనంటూ సెంటిమెంట్ కామెంట్ లు చేయడం ఎందరినో కదిలించింది అని చెప్పాలి.ఈ రాష్ట్రంలో అప్పుల దరిద్రం తప్ప..అభివృద్ధి ఎక్కడంతో ప్రశ్నించారు. నేడు రాష్ట్రాన్ని పై నుండి చూస్తున్న అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి అంటూ హాట్ కామెంట్స్ చేశారు పాల్.