ScienceAndTech

జూన్ 26 నుండి యూట్యూబ్ లో స్టోరీస్ ఫీచర్ నిషేధం….

జూన్ 26 నుండి యూట్యూబ్ లో స్టోరీస్ ఫీచర్ నిషేధం….

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూట్యూబ్ లో స్టోరీస్ ఫీచర్ ఆప్షన్ ను తొలగిస్తున్నట్టు యూట్యూబ్ ప్రకటించింది. స్టోరీస్ ఫీచర్ ఆప్షన్ ను జూన్ 26 నుండి ఆపేయనుంది. దాంతో నిర్దేశించిన గడువు తర్వాత వారం రోజుల వ్యవధిలో ఇప్పటికే క్రియేటర్ లు షేర్ చేసిన స్టోరీస్ లోని పోస్టులు కూడా కనిపించవు. 2017లో యూట్యూబ్ పదివేల మంది సబ్స్క్రైబర్ లు ఉన్న యూజర్ ల కోసం స్టోరీస్ అనే ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

అయితే ఈ ఫీచర్ తో యూట్యూబ్ క్రియేటర్ లు కంటెంట్ ను ప్రమోట్ చేసుకునేందుకు వీలుగా ఉండేది. కానీ యూట్యూబ్ ఊహించిన స్థాయిలో క్రియేటర్ లు స్టోరీల పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ఈ ఫ్యూచర్ ను వెనక్కి తీసుకోబోతున్నట్టు ప్రకటించింది. యూట్యూబ్ క్రియేటర్ లు తాము అప్ లోడ్ చేస్తున్న కంటెంట్ ను ప్రమోట్ చేసుకునేందుకు స్టోరీలైన్ కి బదులుగా కమ్యూనిటీ పోస్టులు, షార్ట్స్ ను వినియోగిస్తున్నారు.

యూజర్ లను కంటెంట్ తో ఎంగేజ్ చేసేలా ఉన్న ఆ రెండు ఫీచర్ లలో టెక్స్ట్ తో పాటు పోల్స్ క్విజ్ …ఫోటోలు వీడియోలు షేర్ చేసే అవకాశం ఉంది ఇక ఎన్ని సౌకర్యాలు ఉండటంతో స్టోరీస్ ఫీచర్ ఫీచర్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో ఆ ఆప్షన్ లేకపోయినా పెద్దగా నష్టమేమీ లేదని యూట్యూబ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇకపై స్టోరీస్ ఫీచర్ ను ఆపేయాలని నిర్ణయించుకుంది.