NRI-NRT

మా దేశంలో ఐఫోన్లపై అమెరికా హ్యాకింగ్….

మా దేశంలో ఐఫోన్లపై అమెరికా హ్యాకింగ్….

అమెరికాతో పాటు యాపిల్‌ కంపెనీపై రష్యన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది.
తమ దేశంలోని వేలాది ఐఫోన్ పరికరాలను హ్యాక్ చేయడం ద్వారా అమెరికా పెద్ద ఎత్తున గూఢచర్యానికి పాల్పడుతోందని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్స్కీ ల్యాబ్ఈ ఆరోపణలు చేసింది.
పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లో పనిచేస్తున్న తమ సిబ్బంది పరికరాల్లో ఫైల్ దొంగిలించే మాల్వేర్ చేర్చబడిందని కాస్పెర్స్కీ ల్యాబ్ కంపెనీ పేర్కొనట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
హ్యాక్ అయిన వ్యక్తుల్లో అనేక మంది రష్యన్ ఐఫోన్ వినియోగదారులు, దేశంలోని దౌత్య కార్యకలాపాలు, రాయబార కార్యాలయాలకు సంబంధించిన వ్యక్తుల ఫోన్లు ఉన్నట్లు మాస్కో ఆరోపిస్తోంది.
రష్యా ఆరోపణలను ఖండించిన యాపిల్ ప్రతినిధి
ఏ యూజర్ ద్వారా ప్రేరేపించబడని iMessage అటాచ్‌మెంట్‌తో ఈ ఉల్లంఘన జరిగినట్లు కాస్పెర్స్కీ ల్యాబ్ చెప్పిది.
రష్యా ఐఫోన్లలో ఇన్ స్టాల్ అయిన మాల్వేర్ అనేది పెగాసస్ స్పైవేర్, అంతర్జాతీయ ప్రభుత్వ సంస్థలకు విక్రయించే వెక్టర్‌ను పోలి ఉంటుందని కాస్పెర్స్కీ పేర్కొంది.
మాల్వేర్ గుట్టు విప్పేందుకు తమ పరిశోధకులు ప్రయత్నిస్తున్నారని కాస్పెర్స్కీ ప్రతినిధి వాషింగ్టన్ పోస్ట్‌తో చెప్పారు.
వేలాది మంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్ జరిగిందని రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) ఆరోపించింది. దీనికి యాపిల్ సంస్థ సహకరించినట్లు ఆరోపించారు.
రష్యా ఆరోపణలను యాపిల్ ప్రతినిధి ఖండించారు. ఏ యాపిల్ ఉత్పత్తికి కూడా మాల్వేర్‌ను చేర్చలేదని, ఏ ప్రభుత్వంతోనూ కలిసి పని చేయలేదని వివరణ ఇచ్చారు.