వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అదే సమయంలో ఓ షరతు విధించించింది. ప్రతి శనివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన అవినాశ్న దాదాపు 7 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది.ఈ ఉదయం 10.30 గంటలకు సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాశ్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు విచారణ ముగియడంతో తన నివాసానికి వెళ్లిపోయారు.