Politics

ఢిల్లీలో అమిత్ షా, నడ్డా తో చంద్రబాబు భేటీ…

ఢిల్లీలో అమిత్ షా, నడ్డా తో చంద్రబాబు భేటీ…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు భేటీ అయ్యారు. మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు రాత్రి ఎనిమిది గంటల సమయంలో అమిత్ షా నివాసానికి వచ్చారు. అక్కడ నడ్డాను కలిశారు. బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీపై పార్టీ స్పందిస్తూ, ఇది ప్రయివేటు కార్యక్రమమని తెలిపింది.

రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కోసం ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించకుంది. జనసేనతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్ఠానం సిద్ధంగా ఉన్నప్పటికీ, చంద్రబాబుతో కలిసేందుకు ససేమీరా అంటోందనే వాదనలు వినిపించాయి. జనసేనాని మాత్రం మూడు పార్టీలు కలిసి వెళ్లాలని కోరుకుంటున్నారు. పొత్తుల అంశంపై చర్చ సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.