Movies

హైదరాబాదులో స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చిరంజీవి….

హైదరాబాదులో స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి  ముఖ్య అతిథిగా చిరంజీవి….

చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమా షూటింగ్స్ పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. అయితే, తాజాగా మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదులో కొత్తగా నెలకొల్పిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఆసక్తికర అంశం వెల్లడించారు. గతంలో తాను క్యాన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నానని వెల్లడించారు.

చిరంజీవి తాను క్యాన్సర్ బారిన పడే ప్రమాదం నుంచి బయటపడినట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. క్యాన్సర్ను ముందుగా గుర్తించే కొలనో స్కోప్ టెస్ట్ చేయించుకుంటే,అందులో నాన్-క్యాన్సరీయస్ పొలిప్సిని డిటెక్ట్ చేసి తీసేశారని వెల్లడించారు. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని హైదరాబాద్లో ఓ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం చిరంజీవి తెలిపారు.