Politics

బీజేపీ ఉత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్లు జేపీ నడ్డా కీలక ప్రకటన…

బీజేపీ ఉత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్లు జేపీ నడ్డా కీలక ప్రకటన…

ఒడిస్సా రైలు ప్రమాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ బిజెపి నిర్వహిస్తున్న కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు… ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. బిజెపి ప్రభుత్వం ఏర్పడి నేటికీ 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉత్సవ వేడుకల నిర్వహించాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రమాదం పట్ల నడ్డా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. డీఎంకే కూడా ఇదే నిర్ణయం తీసుకుంది