NRI-NRT

ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.

ప్రపంచ  వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.

బహ్రెయిన్‌లో తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ‌ వేడుకలు..

బహ్రెయిన్‌లో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో తెలంగాణా రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుకలు ఘనంగా నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ.. బహ్రెయిన్‌లో తెలంగాణ‌ రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నందుకు చాల సంతోషంగా వుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన ఎందరో మహనీయుల త్యాగఫలం, కేసీఆర్ సారథ్యంతో, ప్రత్యేక తెలంగాణ‌ రాష్ట్రం ఏర్పడింది.
స్వరాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నదని, ఇదంతా సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమైందని అన్నారు.

అమెరికాలో తెలంగాణ దశాబ్ది వేడుకలు…

తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుకలను అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని కొలంబస్‌ నగరంలో బీఆర్‌ఎస్‌ -యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్‌ తన్నీరు మహేష్‌ నేతృత్వంలో ఈ వేడుకలను నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ బాల్యమిత్రుడు సిద్దిపేట వాస్తవ్యులు ఉమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పించి, ప్రొఫెస‌ర్ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా తన్నీరు మహేష్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన అనతి కాలంలోనే కేసీఆర్‌ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారన్నారు. ప్రగతి, విద్య, వైద్యం ఆరోగ్యం, సంక్షేమం, విద్యుత్‌, వ్యవసాయ, సాగు, త్రాగు నీరు ఇలా ఏ రంగం తీసుకున్నా.. తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

మెల్‌బోర్న్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు….

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను మెల్‌బోర్న్‌లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యాన బీఆర్‌ఎస్‌ యూత్ వింగ్ కన్వీనర్ వినయ్ గౌడ్, ఉదయ్ రెడ్డి నాయకత్వంలో వేడుకలను నిర్వహించారు. గత పదేళ్ల లో ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) చేపట్టిన పథకాలను ,అభివృద్ధిని వివరిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ పిలుపు మేరకు దశాబ్ది వేడుకలను పదిరోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్‌, కాన్బెర్ర, అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, బల్లారాట్, పెర్త్, గోల్డ్ కోస్ట్, హోబర్ట్, డార్విన్ నగరాలలో వేడుకలు జరిపి తెలంగాణ కీర్తిని , తెలంగాణలో చేపట్టిన అభివృద్ధిని ఎన్ఆర్ఐలకు వివరిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర, సునిల్, సతీష్, ప్రవీణ్, అమిత్ , సురేష్, వినోద్, చైతన్య, సూర్య రావు , విక్రమ్ కందుల, సంజీవ్ రెడ్డి, శన్ముఖ్, వేణు, సాయి గుప్తా, రాకేష్,అరుణ్, నరేందర్, హరి పల్ల, విజయ్ , డాక్టర్‌ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

స్విట్జర్లాండ్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు….

స్విట్జర్లాండ్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తుచేసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల కేక్ కట్‌చేసి తమ సంతోషాన్ని రెట్టింపు చేసుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ గందె మాట్లాడుతూ.. కేసీఆర్ పట్టుదల, దీక్ష కారణంగానే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. సాధించిన రాష్ట్రాన్ని గత తొమ్మిదేండ్లుగా ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్న తీరును వివరించారు.