Politics

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో నేడు రైతు దినోత్సవం…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో నేడు రైతు దినోత్సవం…

రాష్ట్రంలో ఈ నెల 22 వరకు జరగనున్న దశాబ్ది ఉత్సవాలు నేడు రైతు దినోత్సవంతో ప్రారంభం కానున్నాయి. 9 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన విజయాలు, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్ఠతను తెలిపేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని రైతు వేదికల్లో శనివారం నిర్వహించే రైతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జెడ్పీ సీఈఓ సురేష్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్‌ కోరారు. సూర్యాపేట మండలం ఎండ్లపల్లి గ్రామంలో శనివారం నిర్వహించబోయే రైతు దినోత్సవ ఏర్పాట్లను శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ, డీఏఓ మాట్లాడుతూ ఎండ్లపల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతు దినోత్సవానికి రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు జీడి భిక్షం, తహసీల్దార్‌ వెంకన్న, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సర్పంచ్‌ దండి సుగుణమ్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.