NRI-NRT

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు సంతాపం…

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు సంతాపం…

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచంలోని పలు దేశాధినేతలతో సహా ప్రధాన మంత్రులు స్పందిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి సంతాపం ప్రకటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో సహా ప్రపంచ నాయకులు తన ప్రగాఢ సంతాపన్ని వ్యక్తం చేశారు. దాదాపు 290 మందికి పైగా మరణించిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. వారి కుటుంబాలకు మరియు భారత ప్రభుత్వానికి తమ సంతాపాన్ని తెలిపారు. మూడు రైళ్లకు సంబంధించిన ఈ ప్రమాదం దేశంలోనే అత్యంత ఘోరమైనది మరియు ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. 900 మందికి పైగా గాయపడ్డారు.

యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ ప్రాణాలతో బయటపడిన వారికి మరియు రెస్క్యూ ఆపరేషన్‌లలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న వారికి తన హృదయపూర్వక మద్దతును తెలిపాడు. ఒడిశాలో జరిగిన విషాద సంఘటనల వల్ల ప్రభావితమైన వారందరికీ ప్రధాన మంత్రి సునక్ అన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ సునక్ తెలిపారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీకి టెలిగ్రామ్ ద్వారా సంతాపం తెలిపారు. దయచేసి ఒడిశాలో రైలు ఢీకొన్న విషాద సంఘటనపై మా ప్రగాఢ సానుభూతిని అంగీకరించండి. ఈ విపత్తులో వారి బంధువులు మరియు సన్నిహితులను కోల్పోయిన వారి బాధను మేము పంచుకుంటున్నాము మరియు గాయపడిన ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని మేము ఆశిస్తున్నాము అని తెలిపాడు.

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. భారత్ లో జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఈ విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను అని షరీఫ్ ట్వీట్ చేశారు.

నాలుగు రోజుల భారత్ పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని ప్రచండ కూడా స్పందించారు. ఈరోజు భారతదేశంలోని ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో డజన్ల కొద్దీ మంది ప్రాణాలు కోల్పోవడం నాకు చాలా బాధ కలిగించింది అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జీ, ప్రభుత్వం.. మరియు మృతుల కుటుంబాలకు ఈ దుఃఖ సమయంలో.. వారికి నా సానూభూతి తెలుపుతున్నాను అని నేపాల్ ప్రధాని ప్రచండ అన్నారు.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర దుర్ఘటన తనను కలిచివేసిందని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులకు కెనడియన్లు అండగా ఉంటారని, మద్దతునిస్తారని ప్రకటించారు. ఈ మేరకు కెనడా ప్రధాని ట్రూడో ట్వీట్ చేశారు.

తైవాన్ ప్రెసిడెంట్ ట్సాయి ఇంగ్ వెన్ కూడా ఒడిశా ప్రమాద ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రకులకు సంతాపం ప్రకటించారు. ఈ ఘోర దుర్ఘటనపై ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తూ, ప్రమాదం గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపొన్ ఆకాంక్షించారు.