NRI-NRT

భగవంతుని విమర్శించినందుకు పాకిస్తాన్ లో ఓ వ్యక్తికి మరణ శిక్ష…..

భగవంతుని  విమర్శించినందుకు పాకిస్తాన్ లో ఓ వ్యక్తికి మరణ శిక్ష…..

దైవ దూషణ చేశాడని పాకిస్తాన్ లో ఓ వ్యక్తికి మరణ శిక్ష పడింది. దేవునిపై అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు, దైవ దూషణ చేశాడనే ఆరోపణలపై ఒక క్రైస్తవ యువకుడికి పాకిస్తాన్ కోర్టు శుక్రవారం మరణ శిక్ష విధించింది.

లాహోర్ (Lahore)కు 400 కిలో మీటర్ల దూరంలోని బహవల్ పూర్ లో ఇస్లామ్ కాలనీకి చెందిన 19 ఏళ్ల నౌమాన్ మసేహ దైవాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ చేశాడని, అతనిపై కేసు నమోదు చేసిన అధికారులు వాట్సాప్ ద్వారా అతడు పంపిన మెస్సేజ్ లను సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టారు.

బహవల్ పూర్ కోర్టు కేసు విచారణ చేపట్టింది. నిందితుడిపై మోపిన ఆరోపణలు రుజువు కావడంతో అతనికి మరణ శిక్ష, 20 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు కోర్టు తీర్పు వెల్లడించింది.