టీడీపీ తో బీజేపీ పొత్తు ఊహాగానాలేనని బీజేపీ నేత బండి సంజయ్ తోచిపుచ్చారు. కేంద్రమంత్రి అమిత్‌షా, బీజేపీ నేత నడ్డాలను టీడీపీ అధినేత చంద్రబాబు కలవడంలో తప్పేంటి? అని ప్రశ్నించారు. గతంలో పశ్చిమబెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ వంటి ప్రతిపక్ష నేతలు కూడా.. మోదీ, అమిత్‌షాలను కలిశారు కదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను, ప్రజలను కలవకుండా సీఎం కేసీఆర్ మాదిరిగా.. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే పార్టీ బీజేపీ కాదని స్పష్టం చేశారు. ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సంజయ్ పేర్కొన్నారు.