NRI-NRT

చైనాలో విరిగిపడిన కొండచరియలు….

చైనాలో విరిగిపడిన కొండచరియలు….

ఆదివారం నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో పద్నాలుగు మంది మరణించారు మరియు ఐదుగురు తప్పిపోయినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది.లెషాన్ నగరానికి సమీపంలోని జిన్‌కౌహేలోని ప్రభుత్వ యాజమాన్యంలోని అటవీ స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అని స్థానిక ప్రభుత్వం ఆన్‌లైన్ ప్రకటనలో తెలిపింది.

బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. అటవీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని జిన్‌కౌహీ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం సుమారు 40 వేల మంది నివసిస్తున్నారు.

గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయని, వాటి కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. “ప్రమాదం గురించి సమాచారం తెలియగానే, 180 రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికితీశాం. మరో ఐదుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది’’ అని అధికారులు తెలిపారు.