Movies

‘భోళా శంకర్’ నుంచి కొత్త పాట విడుదల….

‘భోళా శంకర్’ నుంచి కొత్త పాట  విడుదల….

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం భోళాశంకర్. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ నేడు రిలీజైంది. భోళా మానియా అనే ఈ హుషారైన మాస్ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించగా, ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, రేవంత్ పాడారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, చిరంజీవి చెల్లిగా కీర్తిసురేష్ కనిపించనున్నారు.