Politics

నిర్మల్ బిఆర్ఎస్ కొత్త భవనానికి చేరుకున్న సీఎం కేసీఆర్….

నిర్మల్ బిఆర్ఎస్ కొత్త భవనానికి  చేరుకున్న సీఎం కేసీఆర్….

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్మ‌ల్ చేరుకున్నారు. హైద‌రాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా నిర్మ‌ల్ బ‌య‌ల్దేరారు కేసీఆర్. నిర్మ‌ల్ చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి వెళ్లారు. కేసీఆర్ వెంట మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ హైద‌రాబాద్ నుంచి వెళ్లారు.

మ‌రికాసేప‌ట్లో నిర్మ‌ల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు భ‌వ‌నాన్ని, నిర్మ‌ల్ జిల్లా స‌మీకృత క‌లెక్టరేట్ భ‌వనాన్ని కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం ఎల్ల‌ప‌ల్లిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.అటు సీఎం బహిరంగ సభ ప్రాంతంలో గాలి దుమారం చెలరేగగా.. కుర్చీలు, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి.

నిర్మల్ పర్యటనలో భాగంగా జిల్లాకు సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ‘జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ. 10లక్షల చొప్పున, నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, జిల్లాలోని 19 మండలాలకు రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం. టెన్త్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలవడంలో కీలకంగా వ్యవహరించిన జిల్లా విద్యాశాఖను అభినందిస్తున్నా’ అని తెలిపారు