అమెరికాలో తమన్ అండ్ టీం ఓవర్ యాక్షన్ చేశారని.. అంటున్నారు NATS సభ్యులు. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ సంబరాల్లో.. లైఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చిన తమన్.. మరే కార్యక్రమాలను ముందుకు సాగనీయకుండా.. చేశారన్నారు ఈ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని. మ్యూజిక్ అరెంజ్ మెంట్స్ పేరుతో దాదాపు 5 గంటలు తమ స్టేజ్ బ్లాక్ చేశారన్నారు. తాను అనుకున్నట్టు జరగకపోతే పర్ఫార్మెన్స్ చేయకుండా వెళ్లిపోతానంటూ తమన్ బ్లాక్ చేశారంటూ.. చెప్పారు. అంతేకాదు ఈ విషయాన్ని ఇండస్ట్రీ పెద్దల వరకు కూడా తీసుకెళతా అంటూ.. కాస్త గట్టిగా చెప్పారు ఈయన.