Politics

కేసీఆర్ కు భట్టి కౌంటర్….

కేసీఆర్ కు భట్టి కౌంటర్….

నిర్మల్ లో నిన్న జరిగిన సభలో సీఎం కేసీఆర్ కేవలం కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించడం తెలిసిందే. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలపాలంటున్న కాంగ్రెస్ నేతలే బంగాళాఖాతంలో కలిసిపోతారని దుమ్మెత్తిపోశారు. దీనిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు.

కేసీఆర్… నీలాంటి వాళ్లను వందల మందిని చూశాం… ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి నిన్నే బంగాళాఖాతంలో ముంచుతాం… ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడం నీ వల్ల కాదు కదా… నీ తాత వల్ల కూడా కాదు అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.