డెట్రాయిట్ నగరంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుహాసిని నందమూరి, జొన్నవిత్తుల, వై వి ఎస్ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో 9 ఏళ్ల బాలుడు, 11 ఏళ్ల బాలికలు స్కూల్లో అందించిన ‘ఎన్టీఆర్’పై రూపొందించిన ప్రాజెక్టు రిపోర్టును ప్రదర్శించారు. సురేష్ పుట్టగుంట, ఫహద్, సునీల్ పాంట్రా, మనోరమ గొంధి, సీత కావూరి, జో పెద్దిబోయిన, కిరణ్ దుగ్గిరాల, ఉమా, మురళి గింజిపల్లి నిర్వాహక కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.