భారత్- ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభంమైంది. బుధవారం(జూన్7) నుంచి లండన్ వేదికగా ఈ మెగా ఫైనల్ జరగనుంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.
ఈ నేపథ్యంలో ద్రవిడ్ మాట్లాడుతూ.. “వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఎలాగైనా గెలవాలనే ఒత్తిడి మాపై లేదు. ఒక వేళ ఓడినా ఇటీవల టెస్టుల్లో సాధించిన విజయాల విలువ తగ్గదు. గత రెండేళ్లుగా కష్టపడ్డారు కాబట్టి ముగింపుగా ఐసీసీ ట్రోఫీ గెలిస్తే సంతోషిస్తామని… అయితే ఆడిన ప్రతీ చోటా తమదైన ముద్ర వేయడం టీమిండియా సాధించిన ఘనతేనని” పేర్కొన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.సబ్‌స్టిట్యూట్స్, సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, ముఖేష్ కుమార్.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్షాన్ , టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, మాథ్యూ రెన్షా.