NRI-NRT

ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో NTR శతజయంతి వేడుక

ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో NTR శతజయంతి వేడుక

ఆస్ట్రేలియా క్యాపిటల్ నగరం కాన్బెర్రా లో వేడుక గా శత జయంతి ఉత్సవం :

ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా నగరం లో వేడుక గా శత జయంతి
ఉత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా హీరో శివాజీ హాజరయ్యారు.

కాన్బెర్రా అన్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ జరిపిన ఈ కార్యక్రమానికి నాట ప్రెసిడెంట్ ప్రసాద్ తిపిరనేని అధ్యక్ష్యత వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన ఎన్టీఆర్ సింప్లిసిటీ, పని పట్ల ఉండే అంకితం, ప్రజలు అవసరాలు కు తగ్గట్టు సాయం చేయడం ఆయన లోని గొప్పతనం అన్నారు.

ముఖ్య అతిధి హీరో శివాజీ మాట్లాడుతూ..పేదరిక నిర్ములన,అవినీతి నిర్ములన, అసమానతలు తొలిగించడమే ధేయం గా కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారకరామారావు అని కొనియాడారు. రాజకీయాలు లో ఎన్టీఆర్ లాంటి నిబద్దత, నిజాయితీ, నిగర్వం లాంటి వ్యక్తులు ఇప్పుడు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు అని వ్యాఖ్యనిచ్చారు.ఈ సందర్బంగా పలువురికి వారి చేసిన సేవలు కు గాను శివాజీ చేతుల మీదగా అవార్డు లు ప్రధానం చేసారు.

ఈ శత జయంతి వేడుక విజయవంతం కోసం అనేక మంది కష్టపడ్డారు అని వారి అందరకి పేరు, పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు నిర్వాహకులు.