దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఉదయం సెన్సెక్స్ 62,759.19 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,943.20 నుంచి 62,751.72 మధ్య కదలాడింది. చివరకు 240.36 పాయింట్ల లాభంతో 62,787.47 దగ్గర ముగిసింది. నిఫ్టీ 18,612.00 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,640.15 నుంచి 18,582.80 మధ్య ట్రేడ్ అయింది. చివరకు 59.75 పాయింట్లు లాభపడి 18,593.85 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసేటప్పటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 29 పైసలు పతనమై రూ. 82.68 దగ్గర నిలిచింది